తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో త్రిశూలాన్ని విరగొట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఘటనకు ముందు రాత్రి సమయంలో ఒక వ్యక్తి వాటిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు.
కొండయ్యపాలెం పాత రైల్వే గేట్ వీధికి చెందిన వనుము లక్ష్మణారావు(లచ్చన్న)ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరం అంగీకరించినట్టు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. సున్నితమైన కేసును తక్కువ వ్యవధిలో చాకచక్యంగా చేధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: