తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన లోవరాజు ఆత్మహత్యకు యత్నించాడు. ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో తనను చేర్చలేదని మనస్థాపంతో ఈ పనికి సిద్ధమయ్యాడు.
లోవరాజు ఈ ఉదయం గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి హడావుడి చేశాడు. ఉపాధి హామీ పథకంలో తన పేరును చేర్చాలని లేకుంటే దూకేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లోవరాజుతో మాట్లాడి... పని కల్పిస్తామని మాటిచ్చారు. వారి హామీతో శాంతించిన లోవరాజు కిందికి దిగాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి :