ETV Bharat / state

ఆ మూడు చోట్ల మాత్రమే పూర్తి స్థాయి లాక్​డౌన్​ - east godavari district latest lockdown updates

తూర్పుగోదావరి జిల్లాలో లాక్​డౌన్​లో అధికారులు సడలింపులు చేశారు. కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించారు. అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్​ వివరాలు వెల్లడించారు.

lockdown changes happened in east godavari district
ఉదయం 10 గంటల వరకే అనుమతి
author img

By

Published : Jun 25, 2020, 11:35 AM IST

ఈ నెల 25 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ విధించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేశారు. కోనసీమ, వియనవిల్లి మండలం, అమలాపురం పట్టణానికి మాత్రమే పరిమితం చేసినట్టు అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్​ వెల్లడించారు. ఈ మూడు మండలాల్లో పూర్తి స్థాయిలో లాక్​డౌన్​ అమలవుతోందని తెలిపారు.

ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిచ్చారు. అనంతరం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. కోనసీమలోని మిగిలిన 14 మండలాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు అనుమతులు ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రజలెవరైనా.... మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :

భారీగా నమోదవుతున్న కేసులు... తీవ్రమవుతున్న రెడ్​జోన్ వాసుల కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.