రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి అరుణ్ కుమార్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో రైతు భరోసా కేంద్రాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
అమలాపురం డివిజన్లోని 16 మండలాలకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే హబ్‌ను పరిశీలించి ఎంత మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారు, ఏ విధంగా సరఫరా జరుగుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ పోలవరం లోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: