ETV Bharat / state

FARMER DIED IN EAST GODAVARI: పదిహేను ఎకరాల పంట నీటిపాలు.. తట్టుకోలేక ఆగిన కౌలురైతు గుండె! - ఏపీ లేటెస్ట్ న్యూస్

KOULU RAITHU DIED IN EAST GODAVARI: తూర్పుగోదావరి జిల్లా మధురపేటలో విషాదం చోటుచేసుకుంది. కౌలుకు తీసుకొని.. కష్టపడి పండించిన పంటంతా వర్షాల కారణంగా నీటిలో కొట్టుకుపోయింది. అది తట్టుకోలేని ఆ రైతు... గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనతో భార్యాపిల్లలు అనాథలయ్యారు.

koulu-raithu-died-in-east-godavari-district
పదిహేనెకరాల పంట నీటిపాలు.. తట్టుకోలేక ఆగిన కౌలురైతు గుండె!
author img

By

Published : Nov 28, 2021, 9:14 AM IST

Updated : Nov 28, 2021, 11:49 AM IST

FARMER DIED IN EAST GODAVARI: అతనికి చెవులు వినపడవు. అయితేనేం బంగారం లాంటి భార్య వచ్చింది. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఓ కుమార్తె, కుమారుడు జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు వారు దివ్యాంగులు. అయినప్పటికీ ఆ దంపతులు నిరాశపడలేడు. ఎలాగైనా సరే తమ పిల్లలను సంతోషంగా చూసుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే భార్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లింది. భర్త పదిహేనెకరాల భూమిని కౌలుకు తీసుకుని కష్టపడుతూ... పిల్లలను ప్రాణంగా చూసుకుంటున్నాడు. దురదృష్టం వర్షం రూపంలో తలుపుతట్టింది. ఆయన పడిన కష్టమంతా వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. పంటంతా ముంపుకు గురై... కుళ్లిపోయింది. అది తట్టుకోలేని ఆ రైతు గుండె.. ఆగిపోయింది.

KOULU RAITHU DIES: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మధురపేటకు చెందిన మధుర సాయిబాబు (54) భీమనపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. రూ.4లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు చేలు ముంపునకు గురయ్యాయి. శనివారం ఉదయం కుళ్లిన పంట చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని భావించి ఇంటికెళ్లినప్పటికీ పాడైన పంటను తలుచుకుంటూ అన్యమనస్కంగా ఉన్నారు. మధ్యాహ్నానికి గుండెపోటుతో చనిపోయారు. భార్య ఉపాధి నిమిత్తం విదేశంలో ఉన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

.

ఇదీ చూడండి: Rain Alert to AP: నేటి నుంచి రెండ్రోజులపాటు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Last Updated : Nov 28, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.