తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోక అధ్వాన స్థితిలో ఉన్నాయి. రాష్ట్ర, గ్రామీణ రోడ్లకు నిధులు లేక గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి.
అమలాపురం, బొబ్బర్లంక, అంబాజీపేట, గన్నవరం, శివకోడు, మానేపల్లి, ముంగండ, ముంజవరం, నరేంద్రపురం, బెల్లంపూడి, రాజవరం, పొదలాడ తదితర ప్రాంతాల్లో రోడ్లు శిథిలావస్థకు చేరి ప్రయాణం చేయడానికి వీలులేని స్థితిలో ఉన్నాయి. ఈ రహదారులపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు, స్థానికులు వాపోయారు. అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి...: ఆ మూడు చోట్ల మాత్రమే పూర్తి స్థాయి లాక్డౌన్