పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి రెండు రోజుల పర్యటన నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని యానాం చేరుకున్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ యానంలో పలు అభివృద్ధి పనులను, ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి...ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదావరి నది తీరంలో ఉన్న భూమిని పరిశీలించేందుకు బోర్డుపై హైలాండ్కి వెళ్లారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను గవర్నర్ అడ్డుకుంటుందని యానం ప్రజలు నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలు, ఫ్లెక్సీలతో నిరసన తెలియజేశారు.
ఇదీ చదవండి: ఘనంగా ముగిసిన విజయ'నగర' ఉత్సవం