ETV Bharat / state

యానాంలో కార్తిక స్నానాలకు ఏర్పాట్లు - యానాంలో కార్తికమాస ఏర్పాట్లు

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కార్తిక స్నానాలకు ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే షెడ్లు, జల్లు స్నానాలు తదితర వాటిని సిద్ధం చేశారు. రేపటినుంచి కార్తిక మాసం ప్రారంభం కానుంది.

yaanaam
యానాంలో కార్తిక స్నానాలకు ఏర్పాట్లు
author img

By

Published : Nov 15, 2020, 2:27 PM IST

రేపటినుంచి కార్తికమాసం ప్రారంభం సందర్భంగా.. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గోదావరి వద్ద స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావటంతో భక్తులు అధికంగా వస్తుంటారు. నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా, కమిషనర్ గౌరీ సరోట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహా శివలింగం వద్ద జల్లు స్నానాలకు, దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన షెడ్లు, విద్యుత్ దీపాలను సిద్ధం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇవీ చదవండి..

'పండుగ రోజు ప్రజలకు సంతోషం లేకుండా చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.