ETV Bharat / state

Kadiyam Police Harrased Dalith Young man: పోలీసుల దాష్టీకం.. దళిత యువకుడిపై థర్డ్ డిగ్రీ!

Kadiyam Police Harrased Dalith Young Man: తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఆగడాలు మీతిమిరిపోయాయి. తప్పు చేసింది తాను కాదని చెప్తున్నా వినకుండా పోలీసులు ఓ దళిత యువకుడ్ని పోలీస్​ స్టేషన్​కు పిలిపించి చితకబాదారు. అంతేకాకుండా కేసు లేకుండా రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని బాధితుడి భార్య వాపోయింది.

Kadiyam_Police_Harrased_Dalith_Young_man_In_East _Godavari_District

author img

By

Published : Aug 19, 2023, 4:59 PM IST

Updated : Aug 20, 2023, 6:37 AM IST

Kadiyam Police Harrased Dalith Young man In East Godavari District: తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీసులు ఓ కేసు విచారణ పేరిట స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ వాపోయారు. స్టేషన్‌ ఎస్సై తీవ్రంగా కొట్టడంతో పాటు.. దాహం వేస్తోంది నీరు కావాలని అడిగితే మూత్రం తాగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Kadiyam Police Harrased Dalith Young man In East Godavari District: పోలీసుల దాష్టికం.. విచక్షణ రహితంగా యువకుడిపై దాడి..

మహిళ అదృశ్యం కేసులో ఈ నెల 17న స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్సై తీవ్రంగా కొట్టారని చాగల్లు మండలం కుంకుడుపల్లికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ వాపోయారు. సృహతప్పిన తనకు పైకి లేపి మరీ కొట్టి సంతకం చేయించుకున్నారని... ఆపై ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి బాధితుడిని డిశ్చార్జ్‌ చేశారు.

"నేను నా మిత్రునికి బైక్​ ఇచ్చాను. అతను బండి తీసుకెళ్లి మిస్​యూజ్​ చేశాడు. నాకు ఫోన్​ చేసి ఓనిగట్ల రమ్మని చెప్పారు. నా దగ్గర రావటానికి ఎలాంటి వాహనం అందుబాటులో లేదని చెప్పాను. బండి పంపిస్తామని చెప్పి పంపించారు. దానిపై అక్కడకు చేరుకున్నాను. అక్కడి నుంచి కడియం తీసుకువచ్చారు. అక్కడ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులపై, చాతిపై, మొహంపై కొట్టారు. దాహం వేస్తోందని నీళ్లు అడిగితే.. నీళ్లు కాదురా నా మూత్రం తాగు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు." -వెంకటప్రసాద్, బాధితుడు

Allegations On Police: విచారణ పేరుతో పిలిచి చితకబాదారు.. ఓ బాధితుడి ఆవేదన

తన భర్తను పోలీసులు తీసుకెళ్లిన విషయం అర్ధరాత్రి చెప్పారని.. ఆస్పత్రి వద్దకు వస్తే పోలీసులు లోపలికి అనుమతించలేదని బాధితుడి భార్య శిరీష చెప్పారు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని.. ఎంత డబ్బులైనా ఇస్తామని చెప్పారన్నారు. తన భర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు.

"రాత్రి 12గంటల సమయంలో మా భర్తతో పాటు వెళ్లిన వారు ఇంటికి వచ్చి.. మీ ఆయనను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. రాత్రి ఒంటి గంట వరకు నా భర్తే ఫోన్​ చేసి నన్ను పోలీసులు పట్టుకెళ్లారని చెప్పారు. ఫలానా ఆసుపత్రిలో ఉన్నానని చెప్పారు." -శిరీష, బాధితుని భార్య

Police attack on Rythu Diksha camp : అమరావతి రైతు శిబిరంపై పోలీసుల దాడి.. మహిళలు, వృద్ధులను సైతం...

దళిత యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. బాధ్యుడైన ఎస్సై శివాజీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్సై శివాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శివాజీనీ వీఆర్ కు పంపించారు. బాధితుడిని రాజమహేంద్రవరం ఏఎస్పీ రజని ఆస్పత్రిలో పరామర్శించి వివరాలు సేకరించారు.

"ఎస్సై చేసిన చట్ట వ్యతిరేక చర్యలను పోలీసు ఉన్నాతాధికారులు ఖండించాలి. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చర్యలతో పాటు అటువంటి వారు ఉద్యోగాలలో కొనసాగకుండా.. భవిష్యత్​లో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మొన్నటి నుంచి పోలీసులు ఈ కుటుంబంపై నిఘా ఉంచారు. చివరకి ఆసుపత్రి బిల్లులూ పోలీసులు కట్టారు." -ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులు ఓ వ్యక్తి మృతి

Last Updated : Aug 20, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.