ETV Bharat / state

ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు: ఉండవల్లి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శీతల సమావేశ మందిరం, గ్రంథాలయం నిర్మాణ పనులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్ ప్రారంభించారు. ఇసుక, ఇంగ్లీష్ మీడియం అంశాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం హక్కు అని పేర్కొన్నారు.

author img

By

Published : Nov 15, 2019, 12:04 AM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్​ కుమార్
ఇసుక, ఇంగ్లీష్ మీడియం అంశాలపై విమర్శించడం ప్రతిపక్షాల హక్కు : ఉండవల్లి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శీతల సమావేశ మందిరం, గ్రంథాలయం ప్రారంభ కార్యక్రమానికి... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్ హాజరయ్యారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం తప్పు కాదు గాని... అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలని ఆయన కోరారు. ఎవరికి కావాల్సినంత ఇసుక వారికి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోందని... అయితే ధర ఎక్కువగా ఉందన్నారు. దీనిపై వస్తున్న విమర్శలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఇదీ చదవండి: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎంపీ భరత్

Intro:AP_RJY_96_14_EX MP_UNDAVALLI ARUNKUMAR_PRESS MEET_AV_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లోని ధర్మం చర కమ్యూనిటీ హాల్ వద్ద మొదటి అంతస్తులో గ్రంథాలయం ,శీతల సమావేశ మందిరం నిర్మాణ పనులకు సంబంధించి గురువారం జరిగిన ప్రారంభ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పార్లమెంట్లో పోరాడే విధంగా వైకాపా ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించాలని ఆయన కి బుధవారం లేఖ రాయడం జరిగింది అన్నారు. ప్రధాని మోదీ ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగిందని ఒప్పుకున్నప్పుడు మనం ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు . ఇసుక, ఇంగ్లీష్ మీడియం అంశాలపై చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం వాళ్ల హక్కు అన్నారు .అయితే ప్రభుత్వం వివరించే తత్వం ఉండాలి తప్ప 151 సీట్లు తెచ్చుకున్న ప్రభుత్వం విమర్శలకు దిగకూడదు అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేస్తామని అంటున్నారు ,గానీ పోరాటం చేస్తూనే ఉంటారు తప్ప కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదన్నారు.
ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం తప్పు కాదు గాని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టాలన్నారు . ఇంగ్లీష్ మీడియం పై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం కూడా సేకరించాలన్నారు. ఉపాధ్యాయులకు కూడా సరైన శిక్షణ అవసరమన్నారు.
ఎవరికి కావాల్సినంత ఇసుక వారికి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోందని అయితే ధర ఎక్కువగా ఉంటుందన్నారు. దీని పై వస్తున్న విమర్శలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
మతాల గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయని, దీనికి అంత అవసరం లేదన్నారు. హిందూ మతం సనాతన ధర్మం అన్నారు. ఎవరు మంచి చెబితే వారే దేవుడు అని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని దేశం ఇలా ఉందంటే దానికి కారణం ఆయనే అన్నారు. అయితే కొంతమంది నెహ్రూని విమర్శిస్తున్నారని అది సరైన పద్ధతి కాదన్నారు. నెహ్రు చెడ్డవాడు అయితే ఆయన్ని ప్రధానమంత్రి చేసిన మహాత్మా గాంధీ కూడా చెడ్డవాడే నన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి అన్నారు. ఇప్పుడు కొంతమంది చరిత్రను తిరగరాస్తాం అని చెబుతున్నారని ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థంకాని పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.