తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తిలను అరెస్టు చేశారు. గంజాయిని సీలేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తరలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఇసుక అక్రమార్కులకు 22.50 కోట్ల జరిమానా