గోదావరి పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలకు పంపించామని తెలిపారు. అదనంగా ఇంకో ఎన్డీఆర్ఎఫ్, ఐదు అగ్ని మాపక బృందాలు చేరుకున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు ఆదేశించామన్నారు. చీకటిలో వెతుకులాటకు నావికా దళం నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని... గాలింపు చర్యలకు కావాల్సిన అన్ని పరికరాలను అందించామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: