ఆ నిరాశ్రయులకు దాతలే ఆపద్భాందవులు. ఓ ఆపన్నహస్తం వారి చేతికో ముద్ద పెడుతుందోనని ఎదురుచూపులు. మండుటెండలో వారి ఆకలి పరుగులు ...ఆహారం దొరకనపుడు వారి వేదన వర్ణాతీతం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ ప్రారంభం నుంచి దాతలు పేదలకు ఆహారం అందిస్తున్నారు. కొంతమంది ఆహారం కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. అనాథలు, ఒంటరిగా జీవించే వారు, సాధువులు, భిక్షాటన చేసుకునే వారు, ఏ ఆధారం లేని వారు... స్వచ్ఛంద సంస్థలు, యువకులు పంచే ఆహారంపైనే ఆధారపడ్డారు. భోజనం అందించే వాహనం ఎప్పుడొస్తుందా... అని ఎదురు చూస్తున్నవారెంతోమంది. వాహనం కనపడగానే... వారు దానివెనకాలే పరుగెత్తుకుంటూ వెళ్తున్నారు. మహిళలు, వృద్ధులు అన్నం కోసం పడుతున్న పాట్లు ఆవేదన కలిగిస్తున్నాయి. ఒక్కో రోజు ఆహారం దొరక్క పస్తులు ఉంటున్న వారెందరో...కోవిడ్ కేసులు పెరగడంతో రాజమహేంద్రవరంలో వివిధ చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేసి ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూనే దాతలు నిత్యం ఆహారం వితరణ చేస్తున్నారు.
ఇదీచూడండి.