ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు... స్తంభించిన జనజీవనం

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. పలుచోట్ల వాగులకు గండిపడి నీరు రహదారులపైకి చేరి రాకపోకలు స్తంభించాయి.

Heavy rains in all over the state
author img

By

Published : Oct 24, 2019, 9:14 PM IST

Updated : Oct 24, 2019, 10:35 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అన్నవరంలో ప్రమాదకరంగా పంపా నది

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని పంపా జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 105 అడుగులు కాగా.. ప్రస్తుతం 104 అడుగులకు చేరింది. అధికారులు మూడు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీరు జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలన్నీ అన్నవరం నుంచి దారి మళ్లించారు.

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద

కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 4 లక్షల 7 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి నదీ తీర ప్రాంతాల్లో పర్యటించారు. ముక్త్యాల గ్రామంలో రహదారిపైకి నీరు చేరి... అధికారులు ట్రాక్టర్​పై గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంచికచర్లలో అధికారులతో సమావేశమైన కలెక్టర్​... కృష్ణా నదీ పరీవాహక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రాత్రికి నదిలోకి 6.8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నందున పల్లపు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరులో ప్రజల ఇబ్బందులు

వారం రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మినీ బైపాస్ రోడ్... కరెంట్ ఆఫీస్ సెంటర్.. డై కాస్ రోడ్డు తదితర సెంటర్లలో వాననీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విజయనగరంలో రోడ్లు జలమయం

విజయనగరం జిల్లా సాలూరులో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. స్థానిక రామా, డబ్బీ కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. సాగర్ నుంచి 5.53 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడం వల్ల పులిచింతల జలాశయంపై ఒత్తిడి పెరిగింది. దీని పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 40.30 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటికే నిండుకుండను తలపిస్తోన్న పులిచింతల జలాశయం నీటిని 18 గేట్ల ద్వారా ప్రకాశం బ్యారేజీకి విడిచిపెడుతున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ పూర్తిగా నీట మునిగింది. అధికారులు 50 కుటుంబాల జాలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సిక్కోలులో భారీగా వర్షం

భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ఆమదాలవలసలో రహదారులపైకి నీరు చేరింది. గేదెలవానిపేట జంక్షన్ వద్ద ఉన్న వయోడెక్​లో వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇదీ చూడండి:

జోరు వానతో జనజీవనం అస్థవ్యస్తం

Intro:Body:Conclusion:
Last Updated : Oct 24, 2019, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.