రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్థిరంగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో నది తీరాన ఉన్న లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. కోనసీమలోని పి.గన్నవరంలోని లంక గ్రామస్తులు.. పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. దేవీపట్నం, చింతూరు పోలవరం మండలాల్లోని 26 గ్రామాల్లో రహదారులపై నీరు నిలవగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రావతి నుంచి భారీగా వరద గోదావరికి కలుస్తోంది. ఈ రాత్రి ఉధృతి మరింత పెరుగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది చూడండి: కాఫీడే సిద్ధార్థ మృతి- నది ఒడ్డున మృతదేహం