కరోనా విపత్కర సమయంలో గ్రీన్ కో సంస్థ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ కు 20 ఆక్సిజన్ ట్రాన్స్ లేటర్లు, 8 ఆక్సిజన్ సిలిండర్లు అందించింది. కాకినాడ కలెక్టరేట్లో సంస్థ ప్రతినిధి అనిల్ కుమార్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో రూ.15 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా గ్రీన్ కో సంస్థ ఆక్సిజన్ సిలిండర్లు అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ విపత్కర సమయంలో మరింత మంది దాతలు ముందుకు వచ్చి కొవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని ఎమ్యెల్యే చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: శేషాచలం కొండల్లో గుప్త నిధుల వేట.. ఏడాది కాలంగా సొరంగం తవ్వకం