తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో నంబరు 11ను జారీ చేశారు.
రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా పనిచేసి, ఇటీవల రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణారావు ఇప్పటి వరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించారు.
ఇదీ చదవండి