AP Rain Alert : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలీకి 240 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 9కిలో మీటర్ల వేగంతో కదలుతున్న ఇది ఇవాళ కూడా తీవ్ర వాయుగుండం గానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని పేర్కొంది. శనివారం ఉదయానికి (పుదుచ్చేరి) కారైకాల్ - (తమిళనాడు) మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
"అలర్ట్" మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం
ఫంగన్ తుపాను సమాచారాన్ని చేరవేస్తున్న ఉపగ్రహాలు : నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మరో పక్క, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరం సంకేతాలు ఇస్తోంది. ఈవోఎస్-06, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలు ఫంగన్ తుపాను సమాచారాన్ని చేరవేస్తున్నాయి.
తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం - ఆ జిల్లాలో భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు - పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక