Falcon Vehicles In AP : రాష్ట్రంలో దొంగతనాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేసేవారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీరు పోలీసుల కళ్లు కప్పవచ్చు గాని ఈ ఫాల్కన్ వాహనాల కళ్లు మాత్రం కప్పలేరు. 12 కెమెరాలు ఉన్న ఈ వాహనం చిత్తూరులో గస్తీ కాస్తోంది. కెమెరాలు 360 డిగ్రీలు తిరుగుతూ పర్యవేక్షిస్తుంటాయి. దాదాపు అర కిలోమీటరు వరకు క్షుణ్ణంగా కెమెరాల్లో దృశ్యాలు కనిపిస్తాయి. ఎక్కడేం జరుగుతుందో గమనించేందుకు వాహనంలో ఆరు టీవీలతో పాటుగా కంట్రోల్‌రూం సైతం ఏర్పాటుచేశారు. దీనికి అనుసంధానమైన ఉన్న అధికారులు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలోనూ వీక్షిస్తూ మిగిలిన వారికి మార్గనిర్దేశం చేస్తారు.
హైడ్రా తరహాలో ఏపీలో 'ఈగల్' వస్తోంది బీకేర్‌ఫుల్ !
ఇదీ సంగతి: గతంలో పట్టుబడిన దొంగల ఫొటోలను ప్రత్యేకంగా తయారుచేసిన యాప్‌లో పొందుపరిచారు. దొంగతనం చేసిన వ్యక్తి ఫొటో, అతడున్న ప్రదేశాన్ని చూపుతుంది. క్షేత్రస్థాయిలోని సిబ్బంది అప్రమత్తమై దొంగలను వెంటనే క్షణాల్లో పట్టేసే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మూడు వాహనాలను ఏర్పాటుచేశారు. వైకాపా ప్రభుత్వం వీటిని పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని ఇప్పుడు ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఒక్క చిత్తూరులోనే దీన్ని వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యులు పాల్గొనే సభలు, ప్రధాన కార్యక్రమాల్లోనే దీన్ని వినియోగిస్తామని వారు చెబుతున్నారు.
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత