ETV Bharat / state

Government Cheated Polavaram Project Residents: పోలవరం నిర్వాసితుల ఆవేదన.. వివాదాస్పద స్థలం ఇచ్చారని బాధితుల ఆక్రోశం - CM Jagan Forgot Promises To Polavaram Victims

Government Cheated Polavaram Project Residents : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచింది. అవిగో ఇళ్లు.. ఇదిగో పునరావాస ప్యాకేజ్ అంటూ ఆగమేఘాలపై ఊళ్లు ఖాళీ చేయించేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంది. ఏడాదిలో నిర్మిస్తామనన్న పునరావాస కాలనీ.. రెండేళ్లవుతున్నా కొలిక్కిరాలేదు. కనీస సౌకర్యాల జాడేలేదు. నిలువ నీడలేక, కుటుంబ పోషణకు దారిలేక నిర్వాసితులు జీవనం దుర్లభంగా మారింది.

Government_Cheated_Polavaram_Project_Residents

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 10:55 AM IST

Government Cheated Polavaram Project Residents : 2021లో గోదావరి మహోగ్రరూపానికి దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం తదితర గ్రామాల ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా, విడిపోయారు. వారికి పునరావాసం కల్పించేందుకు గోకవరం మండలంలో ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఏడాదిలోగా ఇళ్లు నిర్మిస్తామని, పరిహారం పునరావాస ప్యాకేజ్ ఇచ్చి పంపుతామని నమ్మబలికింది.

Polavaram Project Residents fire on YSRCP Government : ప్రభుత్వం మాట నిలబెట్టుకుని ఉంటే ఈ కాలనీ ఇప్పటికి నిర్వాసితులతో నిండిపోయేది. రెండు సంవత్సరాలు అయినా నేటికీ ఒక్కరితో గృహ ప్రవేశం చేయించలేక పోయారు. చాలా వరకూ గృహాలు అసంపూర్ణంగానే ఉన్నాయి. ఇక రోడ్ల గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. ప్రభుత్వ మాటలు నమ్మి నిర్వాసితులు ఊళ్లు ఖాళీ చేశారు. గోకవరంలో ఇళ్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. పునరావాస కాలనీ ఎప్పటికి పూర్తి అవుతుందోనని ఎదురు చూస్తున్నారు. ఉపాధి గల్లంతై, అద్దెలు కట్టలేక పరిస్థితి రెంటికీ చెడ్డరేవడిలా మారిందని నిర్వాసితులు వాపోతున్నారు.

Polavaram project భూమితోపాటు 10 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న జగన్.. ఇప్పుడు ఎక్కడా?: పోలవరం నిర్వాసితులు

దేవీపట్నం గ్రామస్థులకు గోకవరంలో 55 ఎకరాల విస్థీర్ణంలో.. ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. మొత్తం 522 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. 47 ఎకరాల్లో 430 ఆవాసాల నిర్మాణాలు ప్రారంభించారు. రెండు సంవత్సరాలు దాటినా పూర్తి కాలేదు. మరో 8 ఎకరాలల్లో నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినా న్యాయపరమైన వివాదాలతో అసలు పనులే ప్రారంభం కాలేదు. ఆ స్థలానికి చుట్టూ కర్రలు పాతి, కంచె వేసి రైతులు సాగు చేస్తున్నారు. వివాదాస్పద స్థలం ఇచ్చి తమను నట్టేట ముంచారని బాధితులు ఆక్రోశిస్తున్నారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల దీనగాథలు

పూడిపల్లి గ్రామస్థులకు గోకవరంలోనే మరో చోట 20 ఎకరాల్లో 78 ఇళ్లు మంజూరు చేయగా అందులో 4 వివాదంలో ఉన్నాయి. మొత్తంగా దేవీపట్నం, పూడిపల్లి వాసులకు రెండు చోట్లా కలిపి 439 ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఐతే గుత్తేదారుకు సుమారు 25 కోట్ల మేర బిల్లులు మంజూరు కాకపోవడంతో 3 నెలలుగా పనులు నిలిపేశారు. కె.వీరవరంలోని 52 గిరిజన కుటుంబాలకు గుబ్బలంపాలేనికి ఆనుకొని కొండ సమీపంలో పునరావస కాలనీ ఏర్పాటు చేశారు. అక్కడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాక నిర్వాసితులు అద్దె ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు.

అధికారులు మాత్రం.. ఈ అక్టోబర్ చివరికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన నిర్వాసితులు ఇలాంటి అక్టోబర్‌ గడువులు ఇంకెన్ని మారతాయోనని నిట్టూరుస్తున్నారు.

"మూడు సంవత్సరాల క్రితం బయటకు గెంటేశారు. మాకు కాలనీ ఇస్తామని అన్నారు. ఇవాళ కాలనీ లేదు.. రోడ్డు లేదు.. కరెంట్ లేదు.. సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి ఇసుక ఇస్తామని చెప్పారు. ఇవాళ ఇసుక కూడా ఇవ్వమని చెబుతున్నారు. ప్రయాణపు ఖర్చులు ఇస్తామన్నారు. ఆ డబ్బులు కూడా అధికారులు తినేశారు." పోలవరం నిర్వాసితులు

Polavaram: ముంపులో మగ్గుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.