రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో గ్రామాల విలీన ప్రక్రియ నిలిచిపోయినందున ఆయా గ్రామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని.. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నగరసంస్థ పరిధిలో 21 గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం... ఆ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఆయా గ్రామాల్లో నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణతో పాటు పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు. వెంటనే విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందన కార్యక్రమంలో కమిషనర్ అభిషిక్త్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: