ఎడతెరిపి లేని వర్షాలతో వస్తోన్న వరద నీటితో ధవళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో వరద నీటిని సముద్రంలోకి వదిలివేయాలని అధికార్లు నిర్ణయించారు. ఇప్పటివరకు 1100 టీఎమ్సీల వరద నీరు సముద్రంలోకి వదిలినట్లు గోదావరి డెల్టా, ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ కృష్ణారావు వెల్లడించారు. 175 గేట్లను ఎత్తి మరికొంత వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నట్లు ఆయన వివరించారు. లంక గ్రామప్రజలు, గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఆయన సూచించారు. నాటు పడవల్లో ప్రయాణాలు చేయవద్దని కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : పోలవరం పూర్తయితే..నీటి వృథా మాటే రాదు!