తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నది రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో ముంపునకు గురయ్యే దేవీపట్నం, పోశమ్మగండి, వీరవరం, పూడిపల్లి గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వీరికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ గృహాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. దీంతో గ్రామాలలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటుచేసి ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఇళ్లు పూర్తిగా సిద్ధం అయితేనే తాము వెళ్తామని ఆయా గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చదవండి...