Godavari floods: ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమేపీ పెరుగుతోందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులపై రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరితో పాటు మిగతా ప్రభావిత ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.
గోదావరిలో పెరుగుతున్న వరద పరిస్థితి నేపథ్యంలో రేపు ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక దృష్ట్యా ప్రభావిత మండలాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సహాయ చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి: