గోదావరి వరద మరింతగా పెరిగింది. రాజమహేంద్రవరం వద్ద ఉధృతిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్టు సాయంత్రం 6 గంటల సమయానికి 7లక్షల 52వేల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటిమట్టం 9.6 అడుగులుగా కొనసాగుతోంది. డెల్టా కాల్వలకు 11వేల 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 7లక్షల 49వేల 600 పైగా క్యూసెక్కులు వదులుతున్నారు. వరద ప్రభావంతో దేవీపట్నం మండలం మరోసారి ముంపు బారిన పడుతోంది. దండంగి వద్ద సీతపల్లి వాగులోకి వరదనీరు చేరింది. పూడిపల్లి, వీరవరం, తొయ్యేరు, దేవీపట్నం వద్ద వరదనీరు రహదారి పైకి వచ్చింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద నది క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 37.9 అడుగుల వరదనీటి ప్రవాహం కొనసాగుతోందని సమాచారం.
ఇది కూడా చదవండి.