తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్‌గేట్ వద్ద గ్యాస్ ట్యాంకర్ లీక్ అయ్యింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్.. ఈతకోట టోల్‌గేట్ వద్ద ఆగిన సమయంలో మరో లారీలో తరలిస్తున్న క్రేన్ ట్యాంకర్‌కు బలంగా తగిలింది. ఈ ప్రమాదంతో గ్యాస్ ట్యాంకర్ వెనుక భాగంలో రంధ్రం ఏర్పడి గ్యాస్ లీకైంది. 17 టన్నుల సామర్థ్యం ఉన్న ఎల్పీజీ గ్యాస్ లీకవడం వలన.. టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని గ్యాస్ ట్యాంకర్‌పై నీళ్లు చల్లుతున్నాయి. అధిక సామర్థ్యం ఉన్న ట్యాంకర్ కారణంగా గ్యాస్ లీకేజీని అదుపుచేయడం కష్టంగా మారింది. ట్యాంకర్ ప్రమాదంపై రాజమహేంద్రవరం ఓఎన్జీసీ కాంప్లెక్స్‌కు సమాచారం అందించారు. నిపుణులు వస్తేనే గ్యాస్‌ను అదుపుచేసే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంతో ఎన్‌హెచ్ 16పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: