ETV Bharat / state

ఆ శ్మశానవాటికలో.. 42 కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు! - amalapuram latest news

ఇప్పటి వరకు 42 కొవిడ్ మృతదేహాలకు అమలాపురంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి మే 1 వరకు మొత్తం 50 మంది కొవిడ్ బాధితులు చనిపోయారని.. ఆయన అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా 17 కంటైన్​మెంట్ జోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.​

amalapuram crematorium
అమలాపురం శ్మశానవాటిక
author img

By

Published : May 1, 2021, 9:39 PM IST

Updated : May 2, 2021, 9:56 AM IST

ఏప్రిల్ 21 నుంచి మే 1 వరకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్మశానవాటికలో 42 కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు. అమలాపురంలో ప్రభుత్వ పరంగా గుర్తించిన 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ రెండు ఆసుత్రుల్లో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 50 మంది వరకు చనిపోయారని ఆయన చెప్పారు.

42 మృతదేహాలకు మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించామని.. మిగిలిన 8 మృతదేహాలను వారికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లి వేరు వేరు ప్రాంతాల్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారని వెల్లడించారు. ప్రత్యేకించి అమలాపురం పట్టణంలో కరోనా కేసులు కారణంగా.. మొత్తం 17 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని కమిషనర్ నాయుడు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనాతో సచివాలయ కార్యదర్శి మృతి.. తరలింపునకూ రాని అంబులెన్స్!

అమ్మ, నాన్నను కోల్పోయినా.. సేవకే ఆమె ప్రాధాన్యం

Last Updated : May 2, 2021, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.