తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరామపురం చెరువులో పువ్వులు కనువిందు చేస్తున్నాయి. గుర్రపుడెక్క పూలు చెరువంతా పరుచుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దూరం నుంచి చూస్తే చెరువుపై వంగపువ్వు రంగు తివాచీ పరిచినట్లు అందంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా చెరువులో గుర్రపు డెక్క అనే తీగ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ ఉండడంతో సినిమా సెట్ ను తలపిస్తోంది. ఔత్సాహికులు ఆసక్తిగా తిలకిస్తూ... చిత్రాలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.
చెరువుపై పూల తివాచీ
ఇవీ చదవండి..
మహిళా దినోత్సవ కానుక'
కళ్యాణ వైభోగమే...