తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల కోలాహలం నెలకొంది. 75 రోజుల తర్వాత చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సాధారణ చిన్నచిన్న చేపలు, రొయ్యలు వలలో పడ్డాయి. వేలంపాటలో చేపలను దక్కించుకునేందుకు వ్యాపారులు కూడా పోటీ పడ్డారు. మత్స్యకారులు వేటకు వెళ్లి రావడం వివిధ రాష్ట్రాలకు చేపలు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అయితే ఫిషింగ్ హార్బర్‌లో సామాజిక దూరం పాటించకపోవడం ఒకింత ఆందోళన కలిగించింది. మత్స్యకారులంతా గుంపులు గుంపులుగా చేరి మాస్కులు ధరించకుండా హార్బర్ కలయతిరుగుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హార్బర్‌లో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికి ఎవరూ పట్టించుకోకపోవడం అశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇవీ చూడండి...