తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలోని కాట్రేనికోన, ఐ. పోలవరం మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో ఎన్నికల వేళ స్థానికులందరూ కట్టడితో కిలిసికట్టుగా ఓటు వేశారు. పల్లం, బలుసుతిప్ప, మగసానితిప్ప, భైరవపాలెం, తీర్ధాలమొండి గ్రామాల ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దల కట్టుబాటును అనుసరించి ఎక్కడెక్కడో ఉన్న వారంతా స్వగ్రామాలకు చేరుకుని.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకే ఈ గ్రామాల్లో నూటికి 99 శాతం పోలింగ్ నమోదయ్యింది.
వృద్ధులు, వికలాంగులు కూడా వచ్చి ఓటేశారు. ఓటు వేయాలనే తపనకంటే ..గ్రామ కట్టుబాటు కారణంగా తప్పకుండా ఓటు వేస్తామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. నచ్చినవారికి ఓటేసి వెళ్లడం వీరి కట్టుబాటుకు మరో నిదర్శనం. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే గోదావరి నది పాయల ఒడ్డున నిలిచి ఉన్న బోట్లు, నావలు.
ఇదీ చూడండి: పల్లెపోరు: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పోలింగ్ ఏజెంట్‌పై దాడి