కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ఓ తండ్రి సొంత కూతురితో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చొప్పెల్ల గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికను తండ్రి లైంగిక వేధింపులు గురిచేస్తున్నాడని బాలిక నానమ్మ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చింది.
బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం దుబాయ్లో నివాసముంటుంది. నానమ్మ కూడా జీవనోపాధి నిమిత్తం 15 రోజుల కిందట హైదరాబాద్ వెళ్లింది. తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి చొప్పెల్లలో ఉంటున్నారన్నారు. ముగ్గురు పిల్లల్లో పెద్ద అమ్మాయిపై కొన్ని రోజుల నుంచి తండ్రి రాత్రి సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని నాన్నమ్మకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఇంటికి చేరుకున్న ఆమె ఆలమూరు పోలీస్ స్టేషన్లో కొడుకు చేస్తున్న నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు దిశా డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న డీఎస్పీ చొప్పెల్లలోని ఇంటిని పరిశీలించారు.
ఇదీ చదవండి:
నవ వధువుకు షాక్.. తొలి రాత్రి భర్త వింత ప్రవర్తన.. ఇదేమని అడిగితే...!