తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం వ్యవసాయ పరపతి కేంద్రాల దగ్గర.. యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులుగాస్తున్నారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నందున.. యూరియా ఎంతో అవసరమని వాపోయారు. తగినంతగా నిల్వలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల.. తమ వరకు రావేమోనంటూ ఘర్షణకు దిగుతున్నారు. ఎరువులు అందకపోవడంతో.. మిగిలిన రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రెండు పంచాయతీలకు ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడ ఎరువులను మాత్రం అందుబాటులో ఉంచలేదని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకం లేదా కౌలు రైతు గుర్తింపు కార్డు ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని.. రైతులు డిమాండ్ చేశారు. ఆధార్ కార్డు సాయంతో.. సాగు చేయనివారు కూడా తీసుకుని.. అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Krishna River Bridge issue: వారధి కోసం ఎదురుమొండి ప్రజల 'ఎదురీత'