ఆవు పొడవటంతో ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో జరిగింది. శ్రీనివాసరాజా అనే రైతు.. తన ఆవును తీసుకొని వెళ్తుండగా పొడిచింది.. దీంతో పక్కనే ఉన్న బావిలో తలకిందులుగా పడి ప్రాణాలు విడిచాడు. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికే రైతు మృతి చెందాడు.
ఇవీ చూడండి...