తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమలాపురంలోని శ్రీదేవి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమలాపురంలో శ్రీ వాసవి మాత, వేపచెట్టు కనకదుర్గ, శ్రీ వైష్ణవి కనకదుర్గ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఇదీ చదవండి: గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే