తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని గొల్లలగుంటలో అనుమానస్పదంగా మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని.. పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో జిల్లా ఎన్నికల పరిశీలకులు అరుణ్ కుమార్ పరిశీలించారు. గొల్లలగుంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త ఆదివారం అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడు. గ్రామస్తుల సహకారంతో బయటపడి అదేరోజు మధ్యాహ్నం భార్యతో కలిసి నామినేషన్ వేశారు. సోమవారం మధ్యాహ్నం తన పొలంలో శ్రీనివాస్ రెడ్డి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సంబంధిత కథనాలు: శవమై తేలిన సర్పంచ్ అభ్యర్థి భర్త ..నిన్న అపహరణకు గురైన మృతుడు