CROCODILE: చేపల కోసం వల వేస్తే.. చిక్కిన మొసలి - east godavari district latest news
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు(vaddiparru) వద్ద.. చేపల కోసం గోదావరి నది(godavari river)లో మత్స్యకారులు వల వేశారు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. ఏదో అరుదైన రకం పెద్ద చేప చిక్కిందేమో అనుకుని ఆశగా వల బయటకు లాగారు. అందులో మొసలి ఉండడాన్ని చూసి కొంచెం భయపడ్డారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని బంధించి రాజమహేంద్రవరం తరలించారు.