తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శ్మశాన వాటికలు లేకపోవడంతో అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో 80 ఏళ్ల లోతా వెంకాయమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటిక లేదు.
దీంతో మైళ్లదూరం పాడెను మోసి ఉద్ధృతంగా ప్రవహించే మదేరు వాగు దాటి... అంత్యక్రియలు నిర్వహించారు. ఏజెన్సీలో శ్మశాన వాటికలు లేకపోవడంకారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ఉద్ధృతి ఎక్కువైతే అందరి ప్రాణాలకు ప్రమాదమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి. వాట్సాప్తో సైబర్ నేరగాళ్ల మోసాలు