తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్లో వ్యవసాయ కూలీలు, కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారని… ప్రతి పేద కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆరు నెలల పాటు కరవు భత్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇచ్చి… వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరాారు. పండించిన పంటకు రైైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళలకు డ్వాక్రా రుణాలను రద్దు చేసి స్వయం సహాయక రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవసాయ కూలీకి జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ.500 ఇచ్చి 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న రెవెన్యూ, కొండ, భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వాధికారులు… పంచాయతీ స్థాయిలో.. బ్లీచింగ్‌తో వాటర్ ట్యాంక్‌ను పరిశుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: