తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో జరిగిన దాడి ఘటనలో అరెస్ట్ చేసిన 42 మందిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు చింతలూరులో సందర్శించారు. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల్లో దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా... అమాయకులైన దళితులను అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీసుల సహాయంతో అధికార పార్టీ నాయకులు గ్రామంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.