తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తుమ్మలోవకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకటంతో.. బొమ్మూరు కొవిడ్ కేర్ సెంటర్లో కొద్ది రోజులు ఉండి, ఆ తర్వాత హోం క్వారంటైన్‌కు వెళ్లారు. మళ్లీ అనుమానంతో రాజానగరం కొవిడ్ ఆసుపత్రిలో చేరాడు. రాత్రి బాత్రూమ్కి అని చెప్పిన వెళ్లిన బాధితుడు.. అక్కడే ఉన్న కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గతంలో ఓ కరోనా రోగి మూడో అంతస్తు కిటికీ ద్వారా... దుప్పట్ల సాయంతో కిందకు వెళ్లి పరారయ్యాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై.. కిటికీలన్నీ పకడ్బందీగా మార్చటంతో బాధితుడు బాత్రూమ్ కిటికీలో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. మృతుడు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో అటెండర్‌గా పనిచేసేవాడనీ.. పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు