కొవిడ్-19: అప్రమత్తమైన అన్నవరం దేవస్థానం - latest news on corona in east godavari
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదైన నేపథ్యంలో అన్నవరం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ... ఆలయ ప్రాంగణం, వసతి సముదాయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.