పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 44 గ్రామాల నిర్వాసితులకు వెంటనే ప్యాకేజీ చెల్లించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఇంజనీర్లు, గుత్తేదారులు, నిర్వాసితులతో సమావేశమైన ఆయన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఇందుకూరుపేట, అగ్రహారం, మంటూరు తదితర గ్రామాలకు నిర్మిస్తున్న పునరావాస కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ లక్ష్మీ, ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఏఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...