తెదేపా 100 నుంచి 110 స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి రాబోతుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ధీమా వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ.. మహిళా లోకం పార్టీతోనే ఉందనీ.. నూటికి 70 మంది మహిళామణులు చంద్రబాబుకే ఓటేశారని నొక్కిచెప్పారు. తప్పకుండా విజయం సాధిస్తామనీ, అందులో అనుమానం లేదన్నారు. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. సీఎం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయనీ.. అందుకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..