తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన శాంతి ఈ నెల 18న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన నాలుగో సంతానంగా పుట్టిన పాప చనిపోయిందంటూ భర్తకు ఫోన్ చేసింది. శాంతి భర్త ఊరిలోని ఆశావర్కర్ సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. తాను లేని సమయంలో తన భార్యను భయపెట్టి.. పాపను చింతపల్లి శామ్యూల్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పాపను తిరిగి తల్లి చెంతకు చేర్చారు.
ఇదీ చదవండి