ETV Bharat / state

స్వచ్ఛసర్వేక్షణ్‌ అవగాహన సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి

పరిసుభ్రత అనేది వ్యక్తిగతంగా ప్రారంభం కావాలని.. ఈ అలవాటు వ్యక్తితోపాటు సమాజ అభ్యున్నతికి ఉపకరిస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

changanti koteswar rao
స్వచ్ఛసర్వేక్షణ్‌ అవగాహన సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి
author img

By

Published : Jan 12, 2021, 12:21 PM IST

వ్యక్తిగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛత దిశగా అడుగులేస్తే.. సమాజమంతా స్వచ్ఛంగా ఉంటుందని.. మహాత్ముడి స్ఫూర్తితో మనమంతా స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగస్వాములమవుదామని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో కాకినాడ స్మార్ట్‌సిటీ ఆధ్వర్యంలో కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధ్యక్షతన సోమవారం స్వచ్ఛసర్వేక్షణ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంచి రాజ్యం తయారు కావాలంటే మంచి అలవాటు, సంస్కృతి కలిగిన ప్రజలు ఉండాలని.. ఆ దిశగా అంతా పయనించి స్వచ్ఛ కాకినాడను రూపొందించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్రాథమిక దశ నుంచే చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహనకల్పిస్తే వ్యర్థాలకు అర్థాలు కనిపెడతారన్నారు. కాకినాడలో ఎందరో స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారని, వారి సహాయంతో ఓ ఉద్యమంలా స్వచ్ఛత ప్రచారం జరగాలన్నారు. ఈ సందర్భంగా చాగంటిని నగర కమిషనర్‌తోపాటు ప్రముఖులు సత్కరించారు. మేయర్‌ సుంకర పావని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ మహత్యం... పుట్టుకొచ్చిన కొత్త వ్యాపారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.