ETV Bharat / state

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

author img

By

Published : Mar 6, 2021, 9:09 PM IST

ప్రమాదవశాత్తు ఇన్నోవా కారు పంటబోదులోకి దూసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దండుపుంత రోడ్డులో ఈ సంఘటన జరిగింది.

car accident
పంటబోదులోకి దూసుకెళ్లిన కారు

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని దండుపుంత రోడ్డులో ఇన్నోవా కారు ప్రమాదవశాత్తు పంటబోదులోకి దూసుకెళ్లింది. రాజమహేంద్రవరానికి చెందిన ఏడుగురు భక్తులు ఆ వాహనంలో ప్రయాణిస్తున్నారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు స్పందించి వారిని.. అంబులెన్స్​లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. గడ్డివాములు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.