MP GVL on YCP MPs: తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అవసరాల కోసం వైకాపా నేతలు పార్లమెంటులో ఎప్పుడూ మాట్లాడలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. భాజపా అంటే భయమో లేక భక్తో తెలియదన్న ఆయన... వారు సభలో ఏమీ ప్రస్తావించలేదని తెలిపారు.
వైకాపా నేతలకు దడ పుట్టాలి..
కోటిపల్లి-నరసాపురం రైల్వే నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదలకు డిమాండ్ చేస్తూ అమలాపురం గడియార స్తంభం వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో సోము వీర్రాజుతో పాటు పాల్గొన్నారు. ఈ ధర్నాతో వైకాపా నేతలకు దడ పుట్టాలని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేవంటున్న ప్రభుత్వం... రాష్ట్ర బడ్జెట్ను ఎలా రూపొందిస్తుందో చూస్తామని సోము అన్నారు.
ఇదీ చదవండి: RRR : 'జగన్ అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలి'