ETV Bharat / state

BRSకు జాతీయ అధ్యక్షుడు ఎవరు?.. KCR​కు బండి సూటి ప్రశ్నలు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Bandi Sanjay fire on KCR: బీఆర్‌ఎస్‌కు ఇంత వరకు జాతీయ అధ్యక్షుడే లేకుండనే.. రాష్ట్ర అధ్యక్షుడుని నియమించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. నమ్మించి అందరితో ఓట్లు వేయించుకోవడం కేసీఆర్‌కు తెలిసిన విద్య అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి మాట్లాడిన ఆయన గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్‌ అవమానించలేదా? అని ప్రశ్నించారు.

Bandi Sanjay fire on KCR
Bandi Sanjay fire on KCR
author img

By

Published : Jan 3, 2023, 8:02 PM IST

Bandi Sanjay fire on KCR: ఏపీ సీఎంతో కుమ్మక్కై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేఆర్‌ఎంబీ సమావేశానికి వెళ్లడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కృష్ణా జలాల్లో 570 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఏపీ వాళ్లను గతంలో కేసీఆర్‌ అవమానించలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడు లేకుండనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారని ఆయన ఎద్దేవా చేశారు. నమ్మించి అందరి ఓట్లు వేయించుకోవడం కేసీఆర్‌కు తెలిసిన విద్యేనని దుయ్యబట్టారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ రెచ్చగొడతారని ధ్వజమెత్తారు.

దేశమంతటా ఉచిత విద్యుత్‌ అందిస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్‌.. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఈరోజు డిస్కమ్‌లు రూ.60 వేల కోట్లు నష్టాల్లో ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునర్ధించలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది.. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్ చెప్పాలని ఆయన దుయ్యబట్టారు.

"పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు మద్యం ద్వారా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్రాలకు పన్నుల వాటాను మోదీ పెంచారని ప్రశంసించలేదా? కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు సమీపంలోనే భారత్ బయోటెక్‌ ఉంది. కొవిడ్‌ టీకా భారత్‌ బయోటెక్‌లో ఉత్పత్తి అవుతున్న విషయం కేసీఆర్‌కు తెలుసా? ఎన్నో దేశాలకు భారత్‌ బయోటెక్‌ నుంచి కొవిడ్‌ టీకాలు వెళ్తున్నాయి. యువతను భాజపాకు దూరం చేసేందుకే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. చైనాకు వెళ్తే భారత్‌ బజార్లు ఉంటాయి."- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

BRSకు జాతీయ అధ్యక్షుడు ఎవరు?.. KCR​కు బండి సూటి ప్రశ్నలు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.