ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తూర్పుగోదావరి జిల్లా పరీక్షల నిర్వహణ నోడల్ అధికారి సీహెచ్ సత్తిబాబు తెలిపారు. జిల్లాలో మొత్తం 559 మంది అభ్యర్థులకుగాను 432మంది (77.28 శాతం) పరీక్షకు హాజరైనట్లు వివరించారు. గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన, కరోనా నిబంధన ఏర్పాట్లను పరిశీలించారు.
గండేపల్లి మండలంలోని సూరంపాలెంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రంలో 350 మందికి 275 మంది హాజరయ్యారని అన్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో 209 మందికి 157 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ!