దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా వైకాపా ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం గురువారం కాకినాడలో జరిగింది. దీనికి హాజరైన శైలజానాథ్.. మీడియాతో మాట్లాడారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలు, పంపకాలతో కాలం గడిపేస్తోందని విమర్శించారు. తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్... దించిన మెడ ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరోవైపు వ్యక్తిగత దూషణలతో అసెంబ్లీని జగన్ చులకన చేశారని శైలజనాథ్ విమర్శించారు. శాసనసభ గౌరవాన్ని దిగజార్చిన వైకాపా ప్రభుత్వం... రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదీ చదవండి